మన్యంలో మైనింగ్‌కు అనుమతులివ్వలేదు

ABN , First Publish Date - 2022-02-16T06:08:37+05:30 IST

తమ ప్రభుత్వం మన్యంలో మైనింగ్‌కు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, గిరిజన ప్రాంతంలో ఓటీఎస్‌ను రద్దు చేశారని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

మన్యంలో మైనింగ్‌కు అనుమతులివ్వలేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు, ఫిబ్రవరి 15:తమ ప్రభుత్వం మన్యంలో మైనింగ్‌కు ఎటువంటి అనుమతులు  ఇవ్వలేదని, గిరిజన ప్రాంతంలో ఓటీఎస్‌ను రద్దు చేశారని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. తన క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజనులకు పాలన మరింత చేరువ కావాలనే లక్ష్యంతోనే పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి పాడేరు కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అలాగే ఓటీఎస్‌పై మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీలో ఎక్కడా మైనింగ్‌కు అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈకార్యక్రమంలో ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. 

Read more