మార్కెట్లకు సంక్రాంతి శోభ
ABN , First Publish Date - 2022-01-13T06:25:49+05:30 IST
పట్ట ణం కళకళలాడుతోంది. సంక్రాంతి పం డుగ కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. ఇక మార్కెట్లలో ఈ కోలా హలం అంతా ఇంతా కాదు. ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నం జిల్లా లోని అతిపెద్ద వ్యాపార కేంద్రాల్లో ఒకటి. దీంతో పలు మండలాల గిరిజన ప్రజలు నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులు, ఫ్యాన్సీ, చెప్పులు, బంగారం తదితర సామగ్రి కొనుగో లుకు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు.
పరిసర మండలాల నుంచి కొనుగోళ్లకు భారీగా తరలివచ్చిన జనం
కిక్కిరిసిన ప్రధాన రహదారి
ఫుట్‌పాత్ దుకాణాల వద్ద రద్దీ అధికం
ఊపందుకున్న దుస్తులు, ఫ్యాన్సీ, కిరాణా సామగ్రి వ్యాపారాలు
నర్సీపట్నం, జనవరి 12 : పట్ట ణం కళకళలాడుతోంది. సంక్రాంతి పం డుగ కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. ఇక మార్కెట్లలో ఈ కోలా హలం అంతా ఇంతా కాదు. ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నం జిల్లా లోని అతిపెద్ద వ్యాపార కేంద్రాల్లో ఒకటి. దీంతో పలు మండలాల గిరిజన ప్రజలు నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులు, ఫ్యాన్సీ, చెప్పులు, బంగారం తదితర సామగ్రి కొనుగో లుకు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఫలితంగా ఎక్కడ చూసినా దుకా ణాలు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. బుధ వారం ఇటు నర్సీపట్నం పరిసర మండ లాలతో పాటు, అటు ఏజెన్సీ మండ లాల నుంచి భారీగా కొనుగోలుకు విచ్చే శారు. ఫుట్‌పాత్ దుకాణాలతో పాటు భారీ షోరూమ్‌లలో రద్దీ చాలా అధి కంగా ఉంది. అబీద్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చిరు వ్యాపారులు ఫుట్‌పాత్‌పై వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సీటి క్లబ్ గోడను ఆనుకొని ఫుట్‌పాత్ ఫ్యాన్సీ దుకాణాల వద్ద గ్రామీణ ప్రజలు అధిక సంఖ్యలో కొనుగోళ్లు చేశారు. పెదబొడ్డేపల్లి మదుము నుంచి నర్సీపట్నం అబీద్ సెంటర్‌వరకు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగింది. చుట్ట పక్కల గ్రామాల నుంచి ఆటోలు, బైక్‌లు, కార్లు రాకపోకలు పెరిగాయి.