-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » maoists kalakalam anr-MRGS-AndhraPradesh
-
Maoists: రైలు ఆగగానే లోపలికి ప్రవేశించిన 50 మంది మావోయిస్టులు
ABN , First Publish Date - 2022-09-19T20:31:08+05:30 IST
వాల్తేరు డివిజన్‌కు సంబంధించిన గూడ్స్ రైలును బాన్సీ- బచేలీ మధ్య 50 మంది మావోయిస్టులు నిలిపివేశారు.

అల్లూరి: వాల్తేరు డివిజన్‌కు సంబంధించిన గూడ్స్ రైలును బాన్సీ- బచేలీ మధ్య 50 మంది మావోయిస్టులు నిలిపివేశారు. చేతుల్లో ఆయుధాలు పట్టుకుని, ఎర్రటి గుడ్డలతో ట్రాక్‌పై నిల్చొని రైలు ఆపాలంటూ సంకేతాలు ఇచ్చారు. రైలు ఆగగానే 50 మంది మావోయిస్టులు రైలు లోపలికి ప్రవేశించారు. లోకో పైలట్, రైల్వే గార్డ్ల నుంచి వాకీటాకీలను తీసుకుని.. దంతేశ్వరి స్టేషన్ వద్ద దిగి అడవుల్లోకి వెళ్లిపోయారు. అయితే మావోయిస్టులు రైల్వే సిబ్బందికి ఎటువంటి హాని తలపెట్టలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ మార్గంలో అన్ని రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు డీఆర్ఎం ప్రకటించారు.