31న ‘చలో విజయవాడ’ విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-01-29T04:53:01+05:30 IST

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈనెల 31న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులంతా విజయవంతం చేయాలని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ నేత సీహెచ్‌.నాగరాజు కోరారు.

31న ‘చలో విజయవాడ’ విజయవంతం చేయండి
మాట్లాడుతున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ నేత నాగరాజు


కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ నేత నాగరాజు 


పాడేరు, జనవరి 28: ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈనెల 31న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులంతా విజయవంతం చేయాలని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ నేత సీహెచ్‌.నాగరాజు కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ జేఏసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్‌సీపై జరుగుతున్న పోరాటంలోనూ ఉద్యోగులంతా కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తమను పర్మినెంట్‌ చేస్తామని జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులంతా చలో విజయవాడ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చి జయపద్రం చేయాలన్నిరు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు, వైద్య, కాఫీ, గురుకులాలు, సీఆర్‌టీలు, హాస్టల్‌ వర్కర్లు, ఇతర శాఖల్లోని కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. 


 

Read more