ప్లాస్టిక్‌ రహితంగా హాస్లళ్ల నిర్వహణ

ABN , First Publish Date - 2022-06-07T06:33:48+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతిగృహాలను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించాలని వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి సూచించారు.

ప్లాస్టిక్‌ రహితంగా హాస్లళ్ల నిర్వహణ

ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి

ఏయూ క్యాంపస్‌, జూన్‌ 6: ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతిగృహాలను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించాలని వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి సూచించారు. సోమవారం ఆయన ఏయూ శాతవాహన హాస్టల్‌లో జరుగుతున్న మరమ్మతులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్‌లోని ప్రతీ  అంతస్థులో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్లిక్‌ను నిషేధించినందున విద్యార్థులు, సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు శంకరరావు, విజయమోహన్‌, రమణ, వీరాస్వామి, తదితరులు పాల్గొన్నారు. 


Read more