గాజుల అలంకరణలో మహా కామేశ్వరి
ABN , First Publish Date - 2022-08-09T05:55:01+05:30 IST
పెందుర్తి వెంకటాద్రి శిఖరం ఘాట్‌రోడ్డు దిగువన గల మహా కామేశ్వరి సహిత ద్వాదశ సహిత జ్యోతిర్లింగాలయంలో సోమవార మహాకామేశ్వరి మాతను గాజులతో అలంకరించారు.

పెందుర్తి, ఆగస్టు 8: పెందుర్తి వెంకటాద్రి శిఖరం ఘాట్‌రోడ్డు దిగువన గల మహా కామేశ్వరి సహిత ద్వాదశ సహిత జ్యోతిర్లింగాలయంలో సోమవార మహాకామేశ్వరి మాతను గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టు విగ్రహం మొత్తం రంగు రంగుల గాజులతో చేసిన అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ సన్నిధిలో మహిళలు లక్ష కుంకుమార్చన చేశారు. ఆలయ చైర్మన్ ధవళ యజ్ఞేశ్వర చైనులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.