మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు లాటరీ

ABN , First Publish Date - 2022-07-07T06:50:36+05:30 IST

ల్లాలోని చీడికాడ, మరుపాక, తేగాడ, పాటిపల్లి, వేములపూడి గ్రామాల్లోని మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు బుధవారం పట్టణంలోని జీవీఎంసీ గవరపాలెం ఉన్నత పాఠశాలలో లాటరీ విధానాన్ని నిర్వహించారు. దరఖాస్తుదారుల వివరాలను పొందుపరిచిన బాక్సుల్లోంచి డీఈవో లింగేశ్వరరెడ్డి ఒక్కొక్క చీటిని ద్వారా తీసి దరఖాస్తుదారుని పేరు నమోదు చేశారు.

మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు లాటరీ
దరఖాస్తులను లాటరీ తీస్తున్న డీఈవో లింగేశ్వరరెడ్డి

  డీఈవో సమక్షంలో నిర్వహణ

అనకాపల్లి టౌన్‌, జూలై 6 : జిల్లాలోని చీడికాడ, మరుపాక, తేగాడ, పాటిపల్లి, వేములపూడి గ్రామాల్లోని మోడల్‌ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు బుధవారం  పట్టణంలోని జీవీఎంసీ గవరపాలెం ఉన్నత పాఠశాలలో లాటరీ విధానాన్ని నిర్వహించారు. దరఖాస్తుదారుల వివరాలను పొందుపరిచిన బాక్సుల్లోంచి డీఈవో లింగేశ్వరరెడ్డి ఒక్కొక్క చీటిని  ద్వారా తీసి దరఖాస్తుదారుని పేరు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఈవో విలేఖర్లతో మాట్లాడుతూ బీసీ-ఎ, బీసీ-డి కేటగిరీల ద్వారా విద్యార్థులకు ఈ లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేస్తామన్నారు. ఒక్కొక్క పాఠశాలలో వంద మందికి ప్రవేశాలు ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. 

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాలు పరిశీలన

జిల్లాలో బుధవారం ప్రారంభమైన పదో తరగతి సప్లమెంటరీ పరీక్షా కేంద్రాలను డీఈవో లింగేశ్వరరెడ్డి పరిశీలించారు. అనకాపల్లిలోని పట్టణ బాలికల ఉన్నత పాఠశాల, జీవీఎంసీ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు.  జిల్లాలో 30 కేంద్రాల్లో ఐదువేల మంది పరీక్షలు రాస్తున్నట్టు చెప్పారు. 


Updated Date - 2022-07-07T06:50:36+05:30 IST