లోకేష్‌ పాదయాత్రను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-12-31T00:49:27+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరిట నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరారు.

లోకేష్‌ పాదయాత్రను విజయవంతం చేయాలి
పోస్టర్‌ను ఆవిష్కరించిన టీడీపీ నాయకులు

టీడీపీ నేత సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు

మహారాణిపేట, డిసెంబరు 30: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పేరిట నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగళం పాదయాత్ర పోస్టర్‌, బ్యానర్‌లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రడు మాట్లాడుతూ నారా లోకేష్‌ జనవరి 27వ తేదీ నుంచి కుప్పం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభిస్తారని వివరించారు. ఈ పాదయాత్ర 400 రోజులపాటు నాలుగు వేల కిలో మీటర్లు మేర సుమారు 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొనసాగుతుందని తెలిపారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు టీడీపీ హయాంలో ఇచ్చిన రూ.3000 నిరుద్యోగ భృతిని జగన్‌ రెడ్డి రద్దు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ, నాయకులు పాశర్ల ప్రసాద్‌, గండి బాబ్జీ, గాడు అప్పల నాయుడు, కోనేటి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:49:27+05:30 IST

Read more