‘చిన్ని’ కృష్ణుడు

ABN , First Publish Date - 2022-11-12T03:48:03+05:30 IST

హస్త కళారంగంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన శ్రీశైలపు వినయ్‌...

‘చిన్ని’ కృష్ణుడు

స్త కళారంగంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన శ్రీశైలపు వినయ్‌ తన నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. 4సెం.మీ సైజులో గోటిపై నిలిచేలా అంకుడు కర్రతో శ్రీకృష్ణుని కళాఖండాన్ని అత్యద్భుతంగా చెక్కాడు. సహజ సిద్ధమైన రంగులు అద్దడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకోసం సుమారు 24గంటలు పాటు శ్రమించినట్టు చెప్పాడు. వినయ్‌ ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి రమణ ఈ రంగంలో జాతీయ పురస్కారాన్ని పొందారు. - ఎలమంచిలి

Updated Date - 2022-11-12T03:48:03+05:30 IST

Read more