జగనన్న లేఅవుట్‌ల్లో మౌలిక సదుపాయాలు లేవు
ABN , First Publish Date - 2022-11-15T00:47:20+05:30 IST
జగనన్న లేఅవుట్‌ల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు.
గొలుగొండ, నవంబరు 14: జగనన్న లేఅవుట్‌ల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపు మేరకు సోమవారం మండలంలో జోగంపేటలో జగనన్న లేఅవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో పది జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితులు చోటుచేసుకున్నాయన్నారు. జగనన్న కాలనీల్లో వైసీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన జనసేన పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, పొన్న పోతురాజు, రేగుబళ్ల శివ,తదితరులు పాల్గొన్నారు.