లారీ బోల్తా: డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-03-23T06:19:31+05:30 IST

మండలంలోని గండిగుండం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్‌ మృతి చెందినట్టు సీఐ వై.రవి తెలిపారు.

లారీ బోల్తా: డ్రైవర్‌ మృతి
లారీ డ్రైవర్‌ శ్రీనివాసరావు మృతదేహం

ఆనందపురం, మార్చి 22: మండలంలోని గండిగుండం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్‌ మృతి చెందినట్టు సీఐ వై.రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన గొనగంటి శ్రీనివాసరావు (46) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఒడిశాలో బియ్యం లోడ్‌ చేసుకుని మండపేట వెళుతుండగా మంగళవారం ఉదయం గండిగుండం సమీపంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సీతారామయ్య ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.


Read more