ఉరకలేస్తున్న కొత్తపల్లి జలపాతం

ABN , First Publish Date - 2022-08-04T06:56:06+05:30 IST

ఉధృతంగా ప్రవహిస్తున్న కొత్తపల్లి జలపాతం

ఉరకలేస్తున్న కొత్తపల్లి జలపాతం
ఉధృతంగా ప్రవహిస్తున్న కొత్తపల్లి జలపాతం

జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొత్తపల్లి జలపాతం ఉరకలేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్నది. భారీ వర్షాలు నేపథ్యంలో చుట్టుపక్కల గెడ్డలు, కొండవాలు ప్రాంతం నుంచి భారీగా నీరు జలపాతంలో కలవడంతో రెండు రోజులుగా జలపాతంలో వరద ఉధృతి ఎక్కువైంది. బుధవారం ఇక్కడికి వచ్చిన పర్యాటకులను నిర్వాహకులు అనుమతించలేదు. వరద ఉధృతి తగ్గే వరకు జలపాతంలో స్నానాలకు అనుమతించబోమని నిర్వాహకులు చెబుతున్నారు.

- పాడేరు రూరల్‌

Updated Date - 2022-08-04T06:56:06+05:30 IST