కొత్తకోటలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-08T00:30:04+05:30 IST
కొత్తకోటలో రోడ్డు విస్తరణ పనులు బుధవారం ప్రారంభమయ్యా యి.
రావికమతం, డిసెంబరు 7: కొత్తకోటలో రోడ్డు విస్తరణ పనులు బుధవారం ప్రారంభమయ్యా యి. వడ్డాది నుంచి వెలంకాయలపాలెం వరకు రహదారి విస్తరణ పనులకు న్యూడెవలప్‌మెంట్ బ్యాం కు రూ.98 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా ఆగిన పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆర్‌అండ్‌బీ నర్సీపట్నం సెక్షన్ జేఈఈ బి.జయరాజ్, మండల రెవెన్యూ అధికారులు చినబ్బాయి, సతీష్, సర్వేయర్లు స్థానిక పెట్రోల్ బంక్ నుంచి కొలతలు వేశారు. సర్వే రాళ్లు ఆధారంగా ఆర్‌అండ్‌బీ స్థలాన్ని మార్కింగ్ చేశారు. బ్రిటీష్ కాలంలోనే ఈ రోడ్డు రికార్డుల్లో వంద అడుగులుగా ఉందని, ఈ మేరకు మార్కింగ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోన లోవరాజు, పందల దేవా, ఎంపీటీసీ సభ్యుడు వూడి దేవా తదితరులు పాల్గొన్నారు.