సందడిగా మార్వాడీల కావడియాత్ర

ABN , First Publish Date - 2022-08-01T06:40:15+05:30 IST

నగరంలో ఆదివారం మార్వాడీలు నిర్వహించిన కావడియాత్ర కన్నులపండువగా సాగింది.

సందడిగా మార్వాడీల కావడియాత్ర

 నగరంలో ఆదివారం మార్వాడీలు నిర్వహించిన కావడియాత్ర కన్నులపండువగా సాగింది. మార్వాడీ యువ మంచ్‌ విశాఖ బృందం ఆధ్వర్యంలో  మాధవధార భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో సామూహిక పూజలు చేశారు. సహజసిద్ధ జలధారలోని నీటిని చిన్నచిన్న మట్టికుండల్లో సేకరించి  కర్రలతో సిద్ధం చేసుకున్న కావడికి నీటి కుండలను మోస్తూ హరహర శంభో శంకర నినాదాలతో సాగారు. రేడియోస్టేషన్‌  జగన్నాఽథ స్వామి మందిరం వద్ద యాత్ర ముగించారు. ఏటా శ్రావణ మాసంలో ఈ ఉత్సవాలను చేపడతామని యువమంచ్‌ ప్రతినిధి నరేష్‌ అగర్వాల్‌ తెలిపారు. 

Read more