కూతురు ప్రేమ పెళ్లిపై ‘కత్తి’!

ABN , First Publish Date - 2022-11-25T01:53:02+05:30 IST

ఓ ప్రేమ పెళ్లి ప్రేమికుడిపై హత్యా యత్నానికి కారణమైంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం ముర వణి గ్రామ శివారుల్లో గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

కూతురు ప్రేమ పెళ్లిపై ‘కత్తి’!

ఆమె ఎదుటే భర్తపై దాడి

యువకుడి పరిస్థితి విషమం

పెద్దకడబూరు, నవంబరు 24: ఓ ప్రేమ పెళ్లి ప్రేమికుడిపై హత్యా యత్నానికి కారణమైంది. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం ముర వణి గ్రామ శివారుల్లో గురువారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. హెచ్‌. మురవణి గ్రామానికి చెందిన హుసేని కుమార్తె సుకన్య స్థానికంగా కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న మాల వీరేష్‌, సుకన్యల మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమను సుకన్య తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పది నెలల కిందట పెద్దలను ఎదురించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆదోనిలో కాపురం పెట్టారు. ఈ నేథ్యంలో గురువారం భార్యా భర్తలిద్దరూ ద్విచక్ర వాహనంపై మురవాణికి వెళ్తుండగా.. వీరి వాహనాన్ని కొంతమంది ఆటోతో ఢీకొట్టారు. దీంతో కిందపడిన వీరేష్‌పై కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. సుకన్య ఫిర్యాదు మేరకు పది మందిపై కేసు నమోదు చేసినట్టు పెద్దకడబూరు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో యువతి తండ్రి హుస్సేని కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2022-11-25T01:53:02+05:30 IST

Read more