టీడీపీలోకి కంఠారం వైసీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2022-11-19T00:26:19+05:30 IST

మండలంలోని కంఠారం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

టీడీపీలోకి కంఠారం వైసీపీ కార్యకర్తలు
వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న ఎంవీవీ ప్రసాద్‌

కొయ్యూరు, నవంబరు 18: మండలంలోని కంఠారం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ ముఖ్య కార్యకర్తలు బొడ్డు వరప్రసాద్‌, కొండేటి బంగారాజు (వనంబాబు)లతో పాటు సుమారు 100 మంది వారి అనుచరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ నేత, జీసీసీ మాజీ చైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ గ్రామస్థాయిలో టీడీపీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా నడుం బిగించాలని ఈ సందర్భంగా ప్రసాద్‌ పిలుపునిచ్చారు. అధికార వైసీపీ ఆగడాలను ఎండకట్టేందుకు శనివారం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. సంక్షేమం పేరిట ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు జి.శ్రీరామ్మూర్తి, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ గోవింద్‌, నాయకులు కురుజు శ్రీను, లోతా భీమరాజు, అనిశెట్టి చిరంజీవి, వుండా నాగేశ్వరావు, కాకురు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:26:19+05:30 IST

Read more