ధనలక్ష్మిగా కనకమహాలక్ష్మి

ABN , First Publish Date - 2022-09-28T06:49:49+05:30 IST

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం కనకమహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

ధనలక్ష్మిగా కనకమహాలక్ష్మి
లక్ష చామంతులతో అమ్మవారికి అలంకరణ

లక్ష చామంతులతో ప్రత్యేక పూజలు


శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం కనకమహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష చామంతి పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర నవవర్ణార్చన, లక్ష్మీ హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో మూడవ రోజైన బుధవారం అమ్మవారు ధాన్యలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

- మహారాణిపేట

Read more