అప్పన్న సన్నిధిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-08-14T06:38:14+05:30 IST

వరాహలక్ష్మీ నృసింహస్వామిని శనివారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ దర్శించుకు న్నారు. అలాగే, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీని వాసరావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

అప్పన్న సన్నిధిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
అప్పన్న సన్నిధిలో పూజలు చేస్తున్న జస్టిస్‌ మన్మోహన్‌ దంపతులు

సింహాచలం, ఆగస్టు 13: వరాహలక్ష్మీ నృసింహస్వామిని శనివారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ దర్శించుకు న్నారు. అలాగే, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీని వాసరావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఏఈవో ఆనంద కుమార్‌ స్వాగతం పలకగా, కప్పస్తంభ ఆలింగనం చేసుకుని బేడామండప ప్రదక్షిణలు చేసిన వారి గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాలను పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మ వారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలీయగా, అధికారులు స్వామి ప్రసాదాన్ని అందజేశారు. 

 

Updated Date - 2022-08-14T06:38:14+05:30 IST