తెలుగు తమ్ముళ్లలో జోష్‌

ABN , First Publish Date - 2022-05-24T06:39:43+05:30 IST

నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మినీ మహానాడు సభ టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నిం పింది. ముఖ్య అతిథులుగా హాజ రైన మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్న పాత్రుడు, టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, ఉత్తరాంధ్ర పార్టీ పరిశీలకుడు ఢిల్లీ యాదవ్‌ తదితరుల ప్రసంగాలతో కార్యకర్తల్లో ఊపు వచ్చింది.

తెలుగు తమ్ముళ్లలో జోష్‌
గంధవరంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రి అయ్యన్న, ఎమ్మెల్సీ నాగజగదీశ్‌


  మినీ మహానాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన వక్తలు

  ఆద్యంతం ఉత్తేజపరచిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రసంగం

చోడవరం, మే 23 : నియోజకవర్గ కేంద్రమైన చోడవరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన  మినీ మహానాడు సభ టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నిం పింది. ముఖ్య అతిథులుగా  హాజ రైన మాజీ మంత్రి సిహెచ్‌.అయ్యన్న పాత్రుడు, టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, ఉత్తరాంధ్ర పార్టీ పరిశీలకుడు ఢిల్లీ యాదవ్‌ తదితరుల ప్రసంగాలతో కార్యకర్తల్లో ఊపు వచ్చింది. మాజీ మంత్రి అయ్యన్న రాష్ట్రంలో జగన్‌ పాలన తీరుతెన్నులు, మంత్రుల పరిస్థితి,  నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మశ్రీపై చేసిన విమర్శలు అందరినీ ఆలోచింపజేశాయి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కార్యకర్తల నుంచి విశేష స్పందన కనిపించింది. అధికార పార్టీని తిట్టుకుని కేసులకు భయపడి ఊరుకుంటే సరిపోదని అయ్యన్న కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. మినీ మహానాడుకు కార్యకర్తలు  భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

గంధవరంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ

ఇదిలావుంటే, మినీ మహానాడు సభ అనంతరం మండలంలోని గం ధవరంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తదితరులు ఆవిష్కరిం చారు. అంతకుముందు కొత్తూరు గ్రామం జంక్షన్‌ నుంచి గంధవరం వరకూ పార్టీ శ్రేణులంతా కలిసి ర్యాలీగా తరలి వెళ్లారు. 

Read more