ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరకులోయ సందర్శన

ABN , First Publish Date - 2022-07-18T06:16:49+05:30 IST

అరకులోయను ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు.

ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరకులోయ సందర్శన
పద్మాపురం గార్డెన్‌ను తిలకిస్తున్న హరిహరనాథ శర్మ

అరకులోయ, జూలై 17: అరకులోయను ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. విశాఖ- కిరండోల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో అరకులోయ వచ్చిన ఆయనకు అరకు సీఐ జీడీ బాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన న్యాయమూర్తి పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియాన్ని సందర్శించారు.

Read more