11న విశాఖలో ఉద్యోగ మేళా

ABN , First Publish Date - 2022-03-05T06:08:16+05:30 IST

విశాఖపట్నం నేషనల్‌ కేరీర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ సబ్‌ రీజనల్‌ ఉపాధి కల ్పనాధికారి నిట్టల శ్యామ్‌సుందర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

11న విశాఖలో ఉద్యోగ మేళా

భీమునిపట్నం(రూరల్‌), మార్చి 4 : విశాఖపట్నం నేషనల్‌ కేరీర్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్‌ మేళా  నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ సబ్‌ రీజనల్‌ ఉపాధి కల ్పనాధికారి నిట్టల శ్యామ్‌సుందర్‌  శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 200 పోస్టుల భర్తీ కోసం ఈ మేళా జరుగుతుందన్నారు. లక్ష్మీహుండాయ్‌, మెడిప్లస్‌, స్కందా మోటార్సు తదితర సంస్థల ప్రతినిధులు మేళాకు హాజరుకానున్నారని తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంచరపాలెం  ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ మేళా ఏర్పాటు చేశామన్నారు.

Read more