26న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2022-02-24T05:13:51+05:30 IST

జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 26న శనివారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధి కారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు.

26న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

విశాఖపట్నం, ఫిబ్రవరి 23:  జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 26న శనివారం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధి కారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు. 3ఎస్‌ బిజినెస్‌ ఇన్‌ఫో సర్వీసెస్‌, అర్జున్‌ ఇన్వెస్టిగేషన్‌ సెక్యూ రిటీ సర్వీసెస్‌, రిలయన్స్‌ నిప్పస్‌ లైఫ్‌ ఇన్స్యూ రెన్స్‌ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని,  ఐటీఐ రిక్రూటర్‌, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌, సెక్యూరిటీ గార్డు, లైఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు నేషనల్‌ కెరీర్‌ సర్వీసెస్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసు కుని ఆరోజు ఉదయం 10 గంటలకు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Updated Date - 2022-02-24T05:13:51+05:30 IST