మాటతప్పడం జగన్‌ దినచర్య: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2022-11-16T03:00:32+05:30 IST

మాట తప్పడం, మడమ తిప్పడం సీఎం జగన్‌కు దినచర్యగా మారిందని, అందుకు కడప జిల్లా స్టీల్‌ ప్లాంట్‌ ఒక ఉదాహరణ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి...

మాటతప్పడం జగన్‌ దినచర్య: తులసిరెడ్డి

వేంపల్లె, నవంబరు 15: మాట తప్పడం, మడమ తిప్పడం సీఎం జగన్‌కు దినచర్యగా మారిందని, అందుకు కడప జిల్లా స్టీల్‌ ప్లాంట్‌ ఒక ఉదాహరణ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు. 2019 నవంబరు 23న కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ఉన్నపురాళ్లపల్లె-పెద్దదండ్లూరు గ్రామాల మధ్య 3,200 ఎకరాల్లో వైఎ్‌సఆర్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఉక్కు కర్మాగారానికి సీఎం హోదాలో జగన్‌ శంకుస్థాపన చేశారని.. మూడేళ్లవుతన్నా అతీగతీ లేదన్నారు. జగన్‌ మాట మీద నిలబడాలని, కనీసం వచ్చే ఏడాది నవంబరు 23 నాటికైనా ఈ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిచేయాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-16T03:00:32+05:30 IST

Read more