సంప్రదాయ కళలను కాపాడుకోవడం మన బాధ్యత

ABN , First Publish Date - 2022-12-15T00:37:31+05:30 IST

సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ థియేటర్‌లో జరుగుతున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జోనల్‌స్థాయి పోటీలు రెండో రోజు కొనసాగాయి.

సంప్రదాయ కళలను కాపాడుకోవడం మన బాధ్యత

సిరిపురం, డిసెంబరు 14: సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్‌ థియేటర్‌లో జరుగుతున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జోనల్‌స్థాయి పోటీలు రెండో రోజు కొనసాగాయి. కార్యక్రమానికి హాజరైన వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రి రోజాకి అభినందనలు చెప్పారు. ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ కళలను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అనంతరం అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కళాకారులకు భరతనాట్యం, తప్పెటగుళ్లు, కాళికావేషాలు, ఽథింసా నృతం తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అదీప్‌రాజ్‌, గణేష్‌కుమార్‌, నాగిరెడ్డి, ఎమ్మెల్సీలు కల్యాణి, వంశీకృష్ణశ్రీనివాస్‌, రాష్ట్ర సృజనాత్మకత సమితి చైర్‌పర్సన్‌ వంగపండు ఉష, సీఈవో ఆర్‌.మల్లికార్జునరావు, కోలా గురువులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:37:35+05:30 IST