ముఖ్యమంత్రి సంకల్పమా.. అధికారుల అత్యుత్సాహమా?

ABN , First Publish Date - 2022-11-12T03:54:27+05:30 IST

యోగివేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం తొలగింపు సీఎం సంకల్పమా....

ముఖ్యమంత్రి సంకల్పమా.. అధికారుల అత్యుత్సాహమా?

వేమన విగ్రహం యథాస్థానంలో ఏర్పాటు చేయాలి: టీడీపీ నిరసన

కడప (ఎడ్యుకేషన్‌), నవంబరు 11: యోగివేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం తొలగింపు సీఎం సంకల్పమా, అధికారుల అత్యుత్సాహమా అని టీడీపీ రాష్ట్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మండిపడ్డారు. వేమన విగ్రహాన్ని యఽథాస్థానంలో తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కడపలోని యోగి వేమన వర్సిటీలో శుక్రవారం వేమన విగ్రహం ఎదుట టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ వైవీయూను వైఎ్‌సఆర్‌ యూనివర్సిటీగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. గతంలో కూడా కడప జిల్లాను వైఎ్‌సఆర్‌ కడప జిల్లాగా, తరువాత వైఎ్‌సఆర్‌ జిల్లాగా పేరు మార్చిన విషయం గుర్తు చేశారు. ఇలా అన్నీ మార్చుకుంటూ పోవడమెందుకు, ఒక్కసారిగా ఏపీని వైఎ్‌సఆర్‌ రాష్ట్రంగా పేరు మారిస్తే సరిపోతుందన్నారు.

నేతలతో అధ్యాపకుల వాగ్వాదం: వేమన విగ్రహం, వైఎ్‌సఆర్‌ విగ్రహం వద్ద నిరసన అనంతరం వైస్‌ చాన్సలర్‌ సూర్యకళావతికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ నేతలతో అధ్యాపకులు వాగ్వాదానికి దిగారు. దీంతో వీసీ కార్యాలయంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. వీసీ కలగజేసుకుని దీనిపై సమీక్షిస్తామని చెప్పడంతో ఘర్షణ సద్దుమణిగింది. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T03:54:28+05:30 IST