బ్రిడ్జి కోర్సుకు ఐటీఐ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
ABN , First Publish Date - 2022-03-06T05:09:14+05:30 IST
ఐటీఐ రెండేళ్లు కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశించేందుకు వీలుగా నిర్వహించే బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జె.శ్రీకాంత్ తెలిపారు.
విశాఖపట్నం, మార్చి 5: ఐటీఐ రెండేళ్లు కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశించేందుకు వీలుగా నిర్వహించే బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ జె.శ్రీకాంత్ తెలిపారు. ఐటీఐలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. అభ్యర్ధులు పదో తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితాతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, ఫోటోలను జతచేసి తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ట్రైనింగ్ అధికారిణి సిహెచ్.లలిత కుమారి (9618322824) ని సంప్రదించాలని సూచించారు.