9న ఉక్కు కాంట్రాక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-03-05T06:37:50+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 150 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ఈ నెల 9న టీటీఐలో ఇంటర్వ్యూలు జరగనున్నాయని సబ్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారి(స్టీల్‌ప్లాంట్‌) పి.ఎం.సతీశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు

9న ఉక్కు  కాంట్రాక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు

ఉక్కుటౌన్‌షిప్‌, మార్చి 4: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 150 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ఈ నెల 9న టీటీఐలో ఇంటర్వ్యూలు జరగనున్నాయని సబ్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారి(స్టీల్‌ప్లాంట్‌) పి.ఎం.సతీశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అన్‌స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ కేటగిరీలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అర్హులైన నిర్వాసిత నిరుద్యోగల జాబితాను ఎంప్లాయిమెంట్‌ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించామని వివరించారు. అర్హులైన వారు తమ ఆర్‌-కార్డు, ఎంప్లాయిమెంట్‌ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, మూడు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. 


Read more