పెట్రో వర్సిటీ ప్రహరీ నిర్మాణ పనుల అడ్డగింత

ABN , First Publish Date - 2022-03-05T06:24:27+05:30 IST

వంగలిలో పెట్రో వర్సిటీ(ఏపీఐఐసీ) ప్రహరీ నిర్మాణ పనులను గ్రామ పెద్దలు కోట్ని అమ్మతల్లి ఆధ్వర్యంలో పలువురు రైతులు శుక్రవారం అడ్డుకున్నారు.

పెట్రో వర్సిటీ ప్రహరీ నిర్మాణ పనుల అడ్డగింత
పెట్రో వర్సిటీ అధికారులతో మాట్లాడుతున్న వంగలి రైతులు

సబ్బవరం, మార్చి 4 : వంగలిలో పెట్రో వర్సిటీ(ఏపీఐఐసీ) ప్రహరీ నిర్మాణ పనులను గ్రామ పెద్దలు కోట్ని అమ్మతల్లి ఆధ్వర్యంలో పలువురు రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పరిహారం అంశంపై కేసు కోర్టులో ఉండగా నిర్మాణ పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తామంతా హైకోర్టును ఆశ్రయిస్తే స్టే వచ్చిందన్నారు. స్టే ఉత్తర్వులు వెకేట్‌ చేసి అప్పుడు పనులు నిర్వహించుకోవాలని రైతులు సూచించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జేఈ కుప్పిలి జయచంద్ర, రైతులు గవర రామునాయుడు, సుంకరి చిన్నకృష్ణ, గెంజి సోంబాబు, కందా అప్పారావు, యర్రా సోంబాబు, సోమినాయుడు, ముమ్మన శ్రీను, జెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read more