ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-08-31T06:08:42+05:30 IST

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఉమ్మడి జిల్లాలో ప్రథమ సంవత్సరం 34 శాతం

ద్వితీయ సంవత్సరంలో 31 శాతం మంది ఉత్తీర్ణత 


మద్దిలపాలెం, ఆగస్టు 30: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 17,704 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 6,007 మంది (34 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 9,100 మందికి గాను 2,884 మంది (32 శాతం), బాలికలు 8,604 మందికి గాను 3,123 మంది (36 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,123 మంది పరీక్షలు రాయగా 4,319 మంది (31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 7,866 మందికి 2,215 మంది (28 శాతం), బాలికలు 6,257 మందికి 2,104 మంది (34 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం నుంచి 1,961 మంది పరీక్షలు రాయగా 969 మంది (49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం 1,794 మంది పరీక్షలు రాయగా 824 మంది (46 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Read more