వైద్య సేవలపై ఆరా

ABN , First Publish Date - 2022-12-15T00:15:09+05:30 IST

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ రామిరెడ్డి పాడేరు మండలం మారుమూల బూరుగుచట్టు గ్రామంలో బుధవారం పర్యటించారు.

వైద్య సేవలపై ఆరా
బూరుగుచట్టు గ్రామంలో రోగితో మాట్లాడుతున్న వైద్య శాఖ డైరెక్టర్‌ రామిరెడ్డి

మారుమూల బూరుగుచట్టు గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ పర్యటన

పాడేరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ రామిరెడ్డి పాడేరు మండలం మారుమూల బూరుగుచట్టు గ్రామంలో బుధవారం పర్యటించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఏజెన్సీకి వచ్చిన ఆయన తొలుత ఘాట్‌లోని అమ్మవారిపాదాలు దర్శించుకుని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జమాల్‌బాషాతో కలిసి ఈదులపాలెం పీహెచ్‌సీ పరిధిలో బూరుగుచట్టు గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పాఠశాలలోని గిరిజన విద్యార్థులకు జరుగుతున్న పైలేరియా నిర్ధారణ పరీక్షలను ఆయన పరిశీలించారు. మాతాశిశు మరణాల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రాఽధాన్యతాక్రమంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. ఆయన వెంట ఫ్యామిలీ ఫిజీషియన్‌ జిల్లా నోడల్‌ అధికారి టి.విశ్వేశ్వరరావునాయుడు, డీఐవో డాక్టర్‌ ప్రభావతి, వైజాగ్‌ డీఎంవో వై.మణి, జిల్లా మలేరియా అధికారి సాంభమూర్తి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:15:12+05:30 IST