లంబసింగి-తాజంగి మధ్య పారిశుధ్యం మెరుగు

ABN , First Publish Date - 2022-12-31T01:12:11+05:30 IST

పర్యాటక ప్రాంతాలైన లంబసింగి- తాజంగి మార్గంలో పారిశుధ్యం మెరుగుకు మండల పరిషత్‌ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. శుక్రవారం ఏడు క్లస్టర్లుగా విభజించి చెత్తను తొలగించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండేతో కలిసి బుధవారం లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌... రహదారులకు ఇరువైపులా పేరుకుపోయిన మద్యం సీసాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం చేశారు.

లంబసింగి-తాజంగి మధ్య పారిశుధ్యం మెరుగు
లంబసింగి-తాజంగి మార్గంలో చెత్తను తొలగిస్తున్న కార్మికులు, అధికారులు

జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో స్పెషల్‌ డ్రైవ్‌

ఏడు క్లస్టర్లుగా విభజించి చెత్తాచెదారం తొలగింపు

చింతపల్లి, డిసెంబరు 30: పర్యాటక ప్రాంతాలైన లంబసింగి- తాజంగి మార్గంలో పారిశుధ్యం మెరుగుకు మండల పరిషత్‌ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. శుక్రవారం ఏడు క్లస్టర్లుగా విభజించి చెత్తను తొలగించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండేతో కలిసి బుధవారం లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌... రహదారులకు ఇరువైపులా పేరుకుపోయిన మద్యం సీసాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం చేశారు. లంబసింగి, తాజంగి ప్రాంతాల్లో తక్షణమే స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని ఎంపీడీవో లాలం సీతయ్యను ఆయన ఆదేశించారు. దీంతో మండలానికి చెందిన 17 మంది కార్యదర్శులు, సుమారు 150 మంది పారిశుధ్య కార్మికులను ఇక్కడకు రప్పించి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. లంబసింగి జంక్షన్‌ నుంచి తాజంగి జలాశయం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల రహదారిని ఏడు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కొక్క క్లస్టర్‌ని ఇద్దరు ముగ్గురు కార్యదర్శులకు అప్పగించి, 15-20 మంది కార్మికులను ఏర్పాటు చేశారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రహదారులకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను సేకరించి ట్రాక్టర్లతో సంపద కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు తాజంగి, లంబసింగి పంచాయతీల్లో అదనపు కార్మికులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్‌డీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:12:12+05:30 IST