పేదల ఇళ్లను త్వరగా నిర్మించాలి: అజయ్‌జైన్‌

ABN , First Publish Date - 2022-11-12T04:51:11+05:30 IST

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు కృషి...

పేదల ఇళ్లను త్వరగా నిర్మించాలి: అజయ్‌జైన్‌

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్లను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరుగా పనిచేసి ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీపై వెళ్లిన నారాయణ భరత్‌గుప్తా వీడ్కోలు సభలో శుక్రవారం అజయ్‌జైన్‌ ప్రసంగించారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రస్తుత ఎండీ లక్ష్మీషా, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T04:51:12+05:30 IST