‘హోదా’ పోయింది.. వెతికిపెట్టండి

ABN , First Publish Date - 2022-11-26T02:26:53+05:30 IST

‘మా ప్రత్యేక హోదా పోయింది. జగన్‌రెడ్డి దొంగిలించాడని అనుమానంగా ఉంది.

 ‘హోదా’ పోయింది.. వెతికిపెట్టండి

తాడేపల్లిలో పోలీసులకు తెలుగుయువత ఫిర్యాదు

తాడేపల్లి టౌన్‌, నవంబరు 25: ‘మా ప్రత్యేక హోదా పోయింది. జగన్‌రెడ్డి దొంగిలించాడని అనుమానంగా ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌తోపాటు మా ప్రత్యేక హోదాను కూడా వెతికి పట్టుకోండి’ అంటూ తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో శుక్రవారం తెలుగుయువత నాయకులు ఫిర్యాదు చేశారు. తెలుగు యువత నాయకులు టీడీపీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించి, స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌ పోయిందని తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసిందని, ఆ ఫోన్‌తోపాటుగా కనిపించకుండా పోయిన ప్రత్యేక హోదాను కూడా వెతికిపెట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2022-11-26T02:26:55+05:30 IST