హైవే పనులతో అవస్థలు

ABN , First Publish Date - 2022-12-12T00:58:21+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కృష్ణాదేవీపేట నుంచి కొయ్యూరు వెళ్లే మార్గం బురదమయంగా మారింది. ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వేసిన మట్టి బురదగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాత కృష్ణాదేవీపేటకు సుమారు కిలో మీటరు దూరం నుంచి చింతాలమ్మఘాట్‌ వరకు, అలాగే కృష్ణాదేవీపేట నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి నడింపాలెం వరకు జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వేస్తున్న మట్టి శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా బురదమయమైంది.

హైవే పనులతో అవస్థలు
వర్షాలకు బురదమయమైన రోడ్డు

- వర్షాలకు బురదమయంగా మారిన రోడ్డు

- వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు

కొయ్యూరు, డిసెంబరు 11: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కృష్ణాదేవీపేట నుంచి కొయ్యూరు వెళ్లే మార్గం బురదమయంగా మారింది. ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం వేసిన మట్టి బురదగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాత కృష్ణాదేవీపేటకు సుమారు కిలో మీటరు దూరం నుంచి చింతాలమ్మఘాట్‌ వరకు, అలాగే కృష్ణాదేవీపేట నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి నడింపాలెం వరకు జాతీయ రహదారి 516-ఈ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వేస్తున్న మట్టి శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా బురదమయమైంది. దీని వల్ల ద్విచక్ర వాహనచోదకులు అదుపుతప్పి పడిపోతు న్నారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్‌ స్టోన్‌డస్టుతో పాటు 20 ఎంఎం మెటల్‌ కలిపి రహదారిపై పరిచినా ఉపయోగం లేకుండాపోయింది. వాహన చోదకులు ఈ రహదారి దాటి ముందుకు వెళ్లలేక కొయ్యూరు నుంచి వచ్చేవారు చింతలపూడి, కొమిమక మీదుగా కృష్ణాదేవీపేట వస్తుండగా, నడింపాలెం నుంచి వచ్చేవారు విధిలేక ప్రమాదకర ప్రయాణాన్ని సాగిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు తమకు శాపంగా మారాయని పలువురు వాపోతున్నారు.

Updated Date - 2022-12-12T00:58:21+05:30 IST

Read more