గోవాడ అభివృద్ధికి నిధులు

ABN , First Publish Date - 2022-12-13T00:39:47+05:30 IST

మండలంలోని గోవాడ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ హామీ ఇచ్చారు.

గోవాడ అభివృద్ధికి నిధులు
గోవాడలో స్థానికులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ

చోడవరం, డిసెంబరు 12: మండలంలోని గోవాడ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ హామీ ఇచ్చారు. సోమవారం మండలంలోని గోవాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల విజ్ఞప్తి మేరకు సేనాపతి అర్జున ఇంటి నుంచి గోవాడ ఫ్యాక్టరీ వరకూ సీసీ రోడ్డు, కాలువ నిర్మాణం, తాపీమేస్తీల కమ్యూనిటీ భవనానికి రూ. 10లక్షలు, ఓంశాంతి భవనాలకు రూ.10లక్షలు, ఇతర కాలనీల్లో సీసీ రోడ్లకు డ్రైనేజీలకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవి కాక ఒకటవ వార్డులోని ఇళ్లస్థలాలు లేని వారికి స్థలాల కేటాయింపునకు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాడి కాసు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏడువాక సత్యారావు, ఎంపీడీవో శ్యాంసుందర్‌, తహసీల్దార్‌ బి. తిరుమలబాబు, పీఆర్‌ డీఈఈ ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీలు బుద్ధ గంగరాజు, బైన ఈశ్వరరావు. పల్లా నరసింగరావు, దేవరపల్లి సత్య, బొడ్డేడ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:39:47+05:30 IST

Read more