గోతుల మయం.. ప్రయాణం భయం..

ABN , First Publish Date - 2022-06-12T06:39:12+05:30 IST

పల్లెలు, పట్టణాల్లోని పలు రహదారులు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎక్కడిక క్కడ నూతుల్లాంటి గోతులు పడినా పట్టించుకునేవారు కరు వయ్యారు.

గోతుల మయం.. ప్రయాణం భయం..
బలిఘట్టం మెయిన్‌ రోడ్డుపై గోతుల్లో చేరిన వర్షపు నీరు

  పల్లెలు, పట్టణాల్లో పలు చోట్ల అస్తవ్యస్తంగా మారిన రహదారులు

అవస్థలు పడుతున్న వాహనచోదకులు 

 పట్టించుకోని పాలకులు

 నర్సీపట్నం అర్బన్‌/ చీడికాడ, జూన్‌ 11 : పల్లెలు, పట్టణాల్లోని పలు రహదారులు పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎక్కడిక క్కడ నూతుల్లాంటి గోతులు పడినా పట్టించుకునేవారు కరు వయ్యారు. ఫలితంగా వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధి బలిఘట్టం ఆర్టీసీ కాంపెక్స్‌ సమీపంలో మెయిన్‌ రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రహదారిలో నర్సీపట్నం నుంచి తుని వరకూ నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగి స్తుంటాయి. చిన్నపాటి వర్షం పడినా ఆ గోతుల్లో నీరు చేరి చెరువును తల పిస్తుంటాయి. ఇది గుర్తించలేని వాహ నచోదకులు చిన్న చిన్న  ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారిలో ప్రయాణం సాహసమేనని అంటున్నారు. 

వరహాపురం- పెదగోగాడ దారిలో ప్రయాణం నరకం!

ఇదిలావుంటే, చీడికాడ మండలం లోని వరహాపురం నుంచి పెదగోగాడ వెళ్లే రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందని పలువురు వాపోతున్నారు. వరహాపురం నుంచి పెదగోగాడకు సుమారు మూడున్నర కిలో మీటర్ల మేర తారు రోడ్డును గతంలో వేశారు. ఈ రోడ్డు పొడవునా కోతకు గురి కావ డంతో మధ్యలో గుంతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆస్పత్రి, పశువైద్య శాల పెద గోగాడలో ఉండడంతో వరహాపురం మీదుగా ప్రయాణించే రోగులు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతు న్నారు. అలాగే, ఇదే రహదారి మీదుగా మిగతా గ్రామాలవారు సైతం వివిధ పట్టణా లకు వెళ్లి వస్తుంటారు. రోడ్లు ఇంత దారుణంగా పట్టించుకోక పోవ డంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. అలాగే, రహదార్లకు ఇరువై పులా తుప్పలు పెరిగిపోవడంతో విష సర్పాల భయం వెంటాడుతోందిన పాదచారులు అంటున్నారు. ఉన్న తాధి కారులు, పాలకులు తక్షణమే స్పం దించి  రహదారులకు మరమ్మ తులు చేపట్టాలని అంతా కోరుతున్నారు. 

Updated Date - 2022-06-12T06:39:12+05:30 IST