భద్రకాళీగా కన్యకాపరమేశ్వరి అమ్మవారు

ABN , First Publish Date - 2022-10-07T06:25:26+05:30 IST

వన్‌టౌన్‌ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం విజయదశిమి రోజు కన్యకాపరమేశ్వరి అమ్మవారు భద్రకాళీ అవతారంలో దర్శనం ఇచ్చారు.

భద్రకాళీగా కన్యకాపరమేశ్వరి అమ్మవారు
కన్యకాపరమేశ్వరి

మహారాణిపేట, అక్టోబరు 6:  వన్‌టౌన్‌ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం విజయదశిమి రోజు కన్యకాపరమేశ్వరి  అమ్మవారు భద్రకాళీ అవతారంలో దర్శనం ఇచ్చారు. ఆలయంలో మూల విరాట్‌కు పాలు, పెరుగు, గంధం వంటి వాటితో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అబిషేక పూజలు నిర్వహించారు. 108 స్వర్ణపుష్పాలతో అమ్మవారికి నివేదించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, శమీ పూజ నిర్వహించారు.  

Read more