వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-11-30T00:38:57+05:30 IST

స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
చోడవరంలో సుబ్రహ్మణ్య స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

చోడవరం, నవంబరు 29: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారు జామున నుంచి ప్రధమాభిషేకం, పంచామృతాభిషేకంతోపాటు, మూలవిరాట్‌ క్షీరాభిషేకం, విశేష పుష్పాలంకరణ కార్యక్రమాలను అర్చకులు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ ప్రారంభించారు. పాలకావిడి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ గూనూరు సత్యనారాయణ, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:38:57+05:30 IST

Read more