గిరి విద్యార్థుల అద్భుత ప్రతిభ

ABN , First Publish Date - 2022-12-31T01:07:03+05:30 IST

ఏజెన్సీలోని గిరిజన విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు విజ్ఞాన సంబరాలు ఎంతో ఉపయోగపడ్డాయని ఎంపీ జి.మాధవి అన్నారు. తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన ‘గిరి విజ్ఞాన సంబరాలు’ శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకత వున్నాయని, వాటికి పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విజ్ఞాన సంబరాల్లో వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించడం ద్వారా గిరిజన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభచూపారని, ఇదే స్ఫూర్తితో మరింత ఎదగాలని ఆమె అన్నారు.

గిరి విద్యార్థుల అద్భుత ప్రతిభ
‘గిరి విజ్ఞాన సంబరాలు’ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ జి.మాధవి

సృజనాత్మకతకు మరింత పదును పెట్టాలి

అరకులోయ ఎంపీ జి.మాధవి

ఘనంగా ముగిసిన ‘గిరి విజ్ఞాన సంబరాలు’

పాడేరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని గిరిజన విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు విజ్ఞాన సంబరాలు ఎంతో ఉపయోగపడ్డాయని ఎంపీ జి.మాధవి అన్నారు. తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన ‘గిరి విజ్ఞాన సంబరాలు’ శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకత వున్నాయని, వాటికి పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విజ్ఞాన సంబరాల్లో వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించడం ద్వారా గిరిజన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభచూపారని, ఇదే స్ఫూర్తితో మరింత ఎదగాలని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ, ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన విజ్ఞాన సంబరాలను విజయవంతం చేశారని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణను అభినందించారు. విద్యార్థులతో వివిధ రకాల ప్రాజెక్టులు చేయించిన గిరిజన సంక్షేమ విద్యా శాఖ డీడీ కొండలరావు, ఉపాధ్యాయుల కృషిని కలెక్టర్‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ట్రైకార్‌ చైర్మన్‌ సతకా బుల్లిబాబు, జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు, ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ, టీడబ్ల్యూ డీడీ కొండలరావు, డీఈవో పి.రమేశ్‌, ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను ప్రజాప్రతినిధులు, అధికారులు తిలకించారు. అనంతరం వేదికపై గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

ఘనంగా ముగిసిన సంబరాలు

తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో మూడు రోజులపాటు నిర్వహించిన ‘గిరి విజ్ఞాన సంబరాలు’ శుక్రవారం ఘనంగా ముగిశాయి. వివిధ పాఠశాలలకు చెందిన 1,100 మంది విద్యార్థులు రూపొందించిన 577 ప్రాజెక్టులను విజ్ఞాన సంబరాల్లో ప్రదర్శించారు. ఇంకా కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, తదితర ఏడు రకాల క్రీడా పోటీల్లో 1,800 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:07:05+05:30 IST