Gayatri Vidyut Summit: స్ఫూర్తి నింపిన గాయత్రీ విద్యుత్ జాతీయ సదస్సు

ABN , First Publish Date - 2022-10-26T12:43:22+05:30 IST

వైజాగ్: గాయత్రీ విద్యా పరిషత్ సాంకేతిక కళాశాలలో జరిగిన గాయత్రీ విద్యుత్(Gayatri Vidyut) జాతీయ సదస్సు స్ఫూర్తి నింపింది.

Gayatri Vidyut Summit: స్ఫూర్తి నింపిన గాయత్రీ విద్యుత్ జాతీయ సదస్సు
Gayatri Vidyut Summit

వైజాగ్: గాయత్రీ విద్యా పరిషత్ సాంకేతిక కళాశాలలో జరిగిన గాయత్రీ విద్యుత్(Gayatri Vidyut) జాతీయ సదస్సు స్ఫూర్తి నింపింది. ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి వచ్చిన పలువురు నిపుణులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో జరిగిన ఈ సదస్సు గ్రీన్ అండ్ రెసిలియంట్ ఎనర్జీ సిస్టమ్స్(Green and Resilient Energy Systems) అనే అంశంపై జరిగింది. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఈ మొబిలిటీ( e-mobility), గాయత్రీ విద్యా పరిషత్ వేదుల శాస్త్రి, గౌరవ అతిథిగా ఐఈఐ విశాఖ జిల్లా లోకల్ చాప్టర్ చైర్మన్ బొట్ట వెంకటరమణ పాల్గొన్నారు. సదస్సుకు జీవీపీ సంస్థ ప్రెసిడెంట్ పీఎస్ రావు, ప్రిన్సిపల్ ఏబీ కోటేశ్వర రావు, ట్రిపుల్ ఈ విభాగాధిపతి జీవీఈ సతీష్ కుమార్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఈ సదస్సు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా(Institute of Engineers India) అనుబంధంతో జరిగిందని సదస్సు కన్వీనర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.

Updated Date - 2022-10-26T12:44:46+05:30 IST