హక్కుల సాధనతోనే బహుజనులకు స్వేచ్ఛ

ABN , First Publish Date - 2022-12-12T01:17:51+05:30 IST

అంబేడ్కర్‌ సూచించిన రాజ్యాంగ హక్కులు సాధించినప్పుడే బహుజనులకు స్వేచ్ఛ లభిస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జి.పరంజ్యోతి అన్నారు.

హక్కుల సాధనతోనే బహుజనులకు స్వేచ్ఛ
సమావేశంలో మాట్లాడుతున్న పరంజ్యోతి

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి

నర్సీపట్నం, డిసెంబరు 11: అంబేడ్కర్‌ సూచించిన రాజ్యాంగ హక్కులు సాధించినప్పుడే బహుజనులకు స్వేచ్ఛ లభిస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జి.పరంజ్యోతి అన్నారు. రోటరీ సమావేశ హాలులో బీఎస్పీ నియోజవర్గ ఇన్‌చార్జి బొట్టా నాగరాజు అధ్యక్షత ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనులైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు అంబేడ్కర్‌ సూచించిన రాజ్యాంగ హక్కులు సాధించి రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. అగ్ర కులాల పార్టీలు కుల, మతాల పేరిట వివక్ష, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోని కృష్ణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T01:17:51+05:30 IST

Read more