ఏపీలో ఉన్నది అరాచక ప్రభుత్వం: Kidari Shravan

ABN , First Publish Date - 2022-06-30T20:14:57+05:30 IST

రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు.

ఏపీలో ఉన్నది అరాచక ప్రభుత్వం: Kidari Shravan

విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్(Kidari sravan kumar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... గిరిజనులకు అకారణంగా రేషన్ కార్డ్స్ తీసేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు అందరూ టీడీపీ వైపు చూస్తున్నారని.. చంద్రబాబు(Chandrababu) సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే... జైల్‌లో పెడుతున్నారని అన్నారు. నర్సీపట్నం లోగిరిజన కౌన్సిలర్ ప్రజా సమస్యలపై కమిషనర్‌ను కలిస్తే కులంపేరుతో దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యలపై సమావేశం అయినట్లు కిడారి శ్రవణ్ తెలిపారు. 

Updated Date - 2022-06-30T20:14:57+05:30 IST