-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » forest land pattas distributed to tribal farmers-NGTS-AndhraPradesh
-
గిరిజనులకు సాగు హక్కు పట్టాలు పంపిణీ
ABN , First Publish Date - 2022-03-05T06:20:46+05:30 IST
మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు అటవీ భూముల సాగు హక్కు పట్టాలను ఎంపీపీ గజ్జలపు మణికుమారి పంపిణీ చేశారు.

319 కుటుంబాలకు మేలు: ఎంపీపీ గజ్జలపు మణికుమారి
గొలుగొండ, మార్చి 4: మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజనులకు అటవీ భూముల సాగు హక్కు పట్టాలను ఎంపీపీ గజ్జలపు మణికుమారి పంపిణీ చేశారు. పట్టాలు పొందిన పప్పుశెట్టిపాలెం, కశిమి, పాతమల్లంపేట పంచాయతీలకు చెందిన 319 గిరిజన కుటుంబాలకు మేలు చేకూరుతుందని ఆమె అన్నారు.. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో డేవిడ్‌రాజ్, జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకట గిరిబాబు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కరనాయుడు, వైసీపీ నాయకులు లెక్కల సత్యనారాయణ, నల్లబెల్లి శ్రీనివాసరావు, వైస్‌ఎంపీపీలు జక్కు నాగమణి, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సరుగుడులో..
నాతవరం: మండలంలోని సరుగుడు గ్రామంలో శుక్రవారం 281 మంది గిరిజనులకు అటవీ భూముల సాగు హక్కు పట్టాలను ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి తహసీల్దార్ జానకమ్మ అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారిని రెవెన్యూ అధికారులు గుర్తించి జాబితాలు తయారు చేశారని, వారందరికీ హక్కు పట్టాలు అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సరుగుడు సర్పంచ్ జి.గంగరాజు, సుందరకోట సర్పంచ్ కె.రాజుబాబు, సరుగుడు మాజీ సర్పంచ్ పట్టెం రాజుబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పి.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.