-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Focus on new district offices-MRGS-AndhraPradesh
-
కొత్త జిల్లాల కార్యాలయాలపై దృష్టిపెట్టాలి
ABN , First Publish Date - 2022-03-06T05:12:33+05:30 IST
జిల్లాల పునర్విభజనలో భాగంగా విశాఖ పరిధిలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల కార్యాలయాలపై అధికారులు దృష్టిపెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి
విశాఖపట్నం, మార్చి 5: జిల్లాల పునర్విభజనలో భాగంగా విశాఖ పరిధిలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల కార్యాలయాలపై అధికారులు దృష్టిపెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొత్త జిల్లాలు, కార్యాలయాల అంశంపై శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వభవనాలు ఉంటే ఎంపిక చేయాలని, లేదంటే నిబంధనల మేరకు అద్దె భవనాలు తీసుకోవాలని సూచించారు. ఆయా కార్యాలయాలకు అవసరమైన ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సాధనాలపై నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందించాలని సూచించారు.