గంజాయి నిర్మూలనపై దృష్టి

ABN , First Publish Date - 2022-08-19T06:35:00+05:30 IST

గంజాయి రవాణా, నాటుసారా తయారీ, క్రమ, విక్రయాలపై ఉక్కుపాదం మోపి సమూలంగా నిర్మూలించే దిశగా చర్యలు ముమ్మరం చేయాలని సిబ్బందిని జిల్లా ఎస్‌పీ సతీష్‌కుమార్‌ ఆదేశించారు.

గంజాయి నిర్మూలనపై దృష్టి
పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసి వస్తున్న ఎస్‌పీ సతీష్‌కుమార్‌


- జిల్లా ఎస్‌పీ సతీష్‌కుమార్‌

కొయ్యూరు, ఆగస్టు 18: గంజాయి రవాణా, నాటుసారా తయారీ, క్రమ, విక్రయాలపై ఉక్కుపాదం మోపి సమూలంగా నిర్మూలించే దిశగా చర్యలు ముమ్మరం చేయాలని సిబ్బందిని జిల్లా ఎస్‌పీ సతీష్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ఆయన కొయ్యూరు, మంప పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల భద్రత ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ రెండు స్టేషన్ల రికార్డులు పరిశీలించారు. క్రైం రేటుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలన్నారు. యువత సంఘ విద్రోహ శక్తుల బారిన పడకుండా వారి కెరీర్‌ గైడెన్స్‌కు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మారుమూల కొండలపై గల గ్రామాలలో మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న గ్రామాలను గుర్తించి తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట సీఐ స్వామినాయుడు, కొయ్యూరు, మంప ఎస్‌ఐలు నాగేంద్ర, లోకేష్‌కుమార్‌ ఉన్నారు.  

Updated Date - 2022-08-19T06:35:00+05:30 IST