మాడుగుల డిగ్రీ కళాశాలకు ఐదెకరాల స్థలం

ABN , First Publish Date - 2022-10-12T04:44:09+05:30 IST

స్థానిక డిగ్రీ కళాశాలకు సొంత భవనాల నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశాలు జారీ చేశారు.

మాడుగుల డిగ్రీ కళాశాలకు ఐదెకరాల స్థలం


జిల్లా కల్టెర్‌ రవి పట్టంశెట్టి ఆదేశాలు

మాడుగుల, అక్టోబరు 11: స్థానిక డిగ్రీ కళాశాలకు సొంత భవనాల నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్‌ పీవీ రత్నం మంగళవారం విలేకర్లకు తెలిపారు. 2008లో ప్రారంభమైన డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు లేక జూనియర్‌ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు.  కళాశాల భవనాల నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలని కోరుతూ కళాశాల ప్రిన్సిపాల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నో మార్లు వినతులు అందజేశారు. జూనియర్‌ కళాశాలకు ఆనుకుని పార్థసారఽథి ఆలయ సమీపంలో గల సర్వే నంబర్‌ 261లో 3.46 సెంట్లు,  262లో 1.54 సెంట్లు మొత్తం ఐదు ఎకరాలు భూమిని డిగ్రీ కళాశాలకు కేటాయించారని తహసీల్దార్‌ రత్నం తెలిపారు. ఆ స్థలాన్ని త్వరలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు అందిస్తామన్నారు. డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపుపై కళాశాల చైర్మన్‌ శ్రీనాధ శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. 

Read more