గిరిజన ప్రాంత టీచర్లకు సెల్ఫీ హాజరు మినహాయించండి

ABN , First Publish Date - 2022-08-17T06:38:57+05:30 IST

మన్యంలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గిరిజన ప్రాంత టీచర్లకు సెల్ఫీ అటెండెన్స్‌ను మినహాయించాలని కోరుతూ స్థానిక జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంగళవారం రాత్రి వినతిపత్రం సమర్పించారు.

గిరిజన ప్రాంత టీచర్లకు సెల్ఫీ హాజరు మినహాయించండి
కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

కలెక్టర్‌కు గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య వినతి 

పాడేరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గిరిజన ప్రాంత టీచర్లకు సెల్ఫీ అటెండెన్స్‌ను మినహాయించాలని కోరుతూ స్థానిక జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌కు గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంగళవారం రాత్రి వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీలో అనేక ప్రాంతాల్లో నెట్‌వర్క్‌, రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో సెల్ఫీ అటెండెన్స్‌ వేయడం సాధ్యంకాదని, అలాగే అటెండెన్స్‌ వేయకపోతే ఒక పూట జీతం కోత విధిస్తామని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారని ఉపాధ్యాయులు కలెక్టర్‌కు తెలిపారు. గిరిజన ప్రాంత టీచర్లకు సెల్ఫీ అటెండెన్స్‌ను మినహాయించాలని కోరారు. నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లోని ఉపాధ్యాయులపై ఒత్తిడి ఉండదని, నెట్‌వర్క్‌ ఉన్న టీచర్లు దానిని అమలు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉపాధ్యాయ సమాఖ్య నేతలు ఆర్‌.జగన్మోహనరావు, ముఖీ శేషాద్రి, మినుముల ప్రసాదరావు, మాసాడ ఈశ్వరరావు, కుడుముల కాంతారావు, గిడ్డి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T06:38:57+05:30 IST