ఫేస్ యాప్ హాజరు మినహాయించండి
ABN , First Publish Date - 2022-08-18T06:21:06+05:30 IST
గిరిజన ప్రాంత ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్ హాజరు మినహయింపు కల్పించాలని గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు బౌడు గంగరాజు డిమాండ్ చేశారు.

గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు గంగరాజు
చింతపల్లి, ఆగస్టు 17: గిరిజన ప్రాంత ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ యాప్ హాజరు మినహయింపు కల్పించాలని గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు బౌడు గంగరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు మండల విద్యా శాఖ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో పూర్తి స్థాయిలో సెల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవన్నారు. దీంతో ఉపాధ్యాయులు యాప్లో హాజరు నమోదు చేయడం ఇబ్బదికంగా ఉందన్నారు. గిరిజన ప్రాంత ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కామేశ్వరరావు పాల్గొన్నారు.