పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-08-08T05:16:14+05:30 IST

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డడీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్‌ కళాశాలలు, 175 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి.

పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు

ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రీషియన్‌ కోర్సులో నాలుగు నెలల పాటు శిక్షణ

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

పెందుర్తి, ఆగస్టు 7: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డడీసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్‌ కళాశాలలు, 175 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో భాగంగా పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల స్కిల్‌ హబ్‌ ఏర్పాటుకు ఎంపికైంది. ఇక్కడి స్కిల్‌ హబ్‌లో నాలుగు నెలల పాటు ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ ఆదివారం తెలిపారు. 18 ఏళ్లు నిండి ఇంటర్‌ వొకేషనల్‌, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి స్థానికంగా వున్న పారిశ్రామిక సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల పదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు వాట్సాప్‌ నంబర్‌ 9014766143కు కూడా తమ దరఖాస్తులను పంపవచ్చునన్నారు. 


Updated Date - 2022-08-08T05:16:14+05:30 IST