‘పేట’లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-01-13T06:28:32+05:30 IST

కొవిడ్‌ బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉండే పరిస్థితులు లేనివారి కోసం పాయకరావుపేటలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు తెలిపారు. బుధవారం పట్టణంలోని పంచాయతీరాజ్‌ గెస్టు హౌస్‌ను పరిశీలించారు.

‘పేట’లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు
పీఆర్‌ గెస్టు హౌస్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో గోవిందరావు

పాయకరావుపేట, జనవరి 12 : కొవిడ్‌ బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉండే పరిస్థితులు లేనివారి కోసం పాయకరావుపేటలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు తెలిపారు. బుధవారం పట్టణంలోని పంచాయతీరాజ్‌ గెస్టు హౌస్‌ను పరిశీలించారు. తహసీల్దార్‌ పి.అంబేడ్కర్‌, ఈఓపీఆర్డీ పి.వెంకటనారాయణల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు నర్సీపట్నం డివిజన్‌లోని పలు మండల కేంద్రాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పా టుకు ప్రభుత్వం భవనాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. జడ్పీటీసీ లంక సూరిబాబు, కో-ఆప్షన్‌ సభ్యుడు కాదా రామకృష్ణ, పీఆర్‌, పీహెచ్‌సీ, విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-13T06:28:32+05:30 IST